కొత్త రేషన్ కార్డులు మంజూరి సివిల్ సప్లైయ్ ఉద్యోగుల కాసులు పండిస్తోంది. ముఖ్యంగా తాత్కాలిక ఉద్యోగులు వసూళ్ల కోసం బరితెగిస్తున్నారు అందుకు ఆఫీస్ నే అడ్డాగా మార్చేసుకున్నారు.
ఒక్కో కార్డు కు రెండు నుంచి మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. రేషన్ కార్డు ల మాటున సాగుతున్న వసూళ్ల గుట్టు రట్టుకావడంతో పౌర సరఫరా అధికారి దిద్దుబాటు చర్యలు తీసుకుంటానని ఇది సంగతి కి చెప్పారు కానీ అవి కూడా ఉత్తిత్తివే ! రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా కావాల్సింది ప్రధానంగా రేషన్ కార్డు.
ప్రతి పేద, నిరు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు అనేది అవసరం.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో మీసేవ సెంటర్ల ఆన్లైన్ చేసుకొని పౌరసరఫరాల కార్యాలయాల్లో వాటిని వెరిఫికేషన్ చేసి వెంటనే కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వం చెబుతుంటే దీనికి భిన్నంగా పౌరసరఫరాల అధికారులు వ్యవహరిస్తున్నారు.
కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పుడు ప్రజలు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా భావించిన పౌరసరఫరాల శాఖలో తాత్కాలిక సిబ్బంది వసూళ్లకు తెర లేపారు.
ఈమేరకు పౌర రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు రావడంతో ఇదే అదునుగా ఎంట్రీ ఇచ్చిన సిబ్బంది ఏకంగా దళారుల అవతారం ఎత్తి.. ‘చెయ్యి’ తడిపితేనే కార్డు అంటూ.. పేదలను ఒత్తిడికి గురి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
కలెక్టరేట్ లోని పౌరసరఫరా కార్యాలయం కేంద్రాల్లోనే అడ్డాలు ఏర్పాటు చేసి.. రూ. 2000 నుంచి రూ. 5000 దాకా దండుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తామని కొందరు సివిల్ సప్లై ఉద్యోగులతో పాటు పలువురు దళారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసల్ కొట్టు..
రెండు రోజుల్లోనే కొత్త రేషన్ కార్డు పట్టు అంటూ ప్రతి రోజూ పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న.
ఇదే అదునుగా భావించిన సదరు సిబ్బంది పై స్థాయి అధికారులతో కుమ్మక్కై కొత్త రేషన్ కార్డులు మంజూరుకు తెర లేపినట్లు తెలిసింది. ఒక్కో రేషన్ కార్డుకు సుమారు రూ 2000 నుంచి రూ 3000 వరకు అందినకాడికి దండుకుంటున్నారు..
రేషన్ కార్డు కోసం ఎదురుచూసే వారి ఆరాటాన్ని ఆసరాగా చేసుకొని వసూళ్లకు తెరలేపారు.దీన్ని ఆసరాగా తీసుకుని పౌర సరఫరా కార్యాలయంలో సిబ్బంది దళారుల అవతారం ఎత్తి తాము సిఫార్సు చేస్తే రేషన్ కార్డు తొందరగా వస్తుందని దరఖాస్తుదారులను మభ్యపెడుతున్నారు.
డబ్బులిస్తే పని తొందరగా పూర్తవుతుందనేసరికి చేసేదేమీ లేక లబ్ధిదారులు అడిగినకాడికి ఇస్తున్నారు. సిబ్బంది తమ వద్ద డబ్బులు తీసుకుంటున్నారని బయటకు చెబితే రేషన్ కార్డు రానీయకుండా చేస్తారేమోనని దరఖాస్తుదారులు భయపడుతున్నారు.
రూ.వెయ్యి, రెండు వేలకు అధికారులకు ఫిర్యాదు చేస్తే అధికారం అడ్డుపెట్టుకుని నాయకులు ఇబ్బందులు పెడతారని మిన్నకుంటున్నారు. డబ్బులు పోయినా రేషన్ కార్డు వస్తే కుటుంబానికి ఆసరా అవుతుందని భావిస్తున్నారు.మా దృష్టికి వచ్చింది..జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి..
రేషన్ కార్డుల కోసం డబ్బులు తీసుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. అందుకే అందుకే అనుమానం ఉన్న సిబ్బందిని విధులు నుంచి తప్పించాము.
ఇక నుంచి స్వయంగా మా ఆధ్వర్యంలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తాము. కొత్త రేషన్ కార్డు సేవలకు పైసా కూడా ఎవరికి చెల్లించల్సిన అవసరం లేదు. మామూళ్లు ఇస్తేనే దరఖాస్తు ఆన్లైన్ చేస్తామని ఎవరైనా చెబితే వెంటనే మాకు ఫిర్యాదు చేయండి. వెంటనే చర్యలు తీసుకుంటాం.
