రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరూపించబోతోంది. నిజామాబాద్ జిల్లాలో పామాయిల్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి తొలి అడుగు వేయబోతున్నట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.
ఈ పరిష్కారానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రేపు సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
పామాయిల్ పరిశ్రమ ఏర్పాటు చేయదగిన అనుకూల ప్రాంతాన్ని ఎంపిక చేయడమే కాకుండా, రైతులకు గరిష్ట లాభాలు ఎలా అందించాలన్న దానిపై కూడా సలహాలు, సూచనలు పొందనున్నారు.
ఈ సమావేశానికి రైతులు, వ్యవసాయ రంగ మేధావులు ప్రత్యేక ఆహ్వానం పొందారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ భాయ్, గ్రంథాలయం చైర్మన్ రాజా రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంగారెడ్డి, పులి నరసింహులు తదితరులు పాల్గొననున్నారు.
