Saturday, April 18, 2026
HomeCRIMEభర్త హత్యకు భార్యసుఫారి ………….ప్రియుడితో కలిసి ప్రణాళిక..భార్యతో సహా నలుగురు నిందితుల అరెస్ట్..

భర్త హత్యకు భార్యసుఫారి ………….ప్రియుడితో కలిసి ప్రణాళిక..భార్యతో సహా నలుగురు నిందితుల అరెస్ట్..


వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో భార్యతో పాటు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు స్థానిక డిఎస్పి శ్రీనివాసరావు వెల్లడించారు.

చిన్న ఆత్మకూరు గ్రామానికి చెందిన పల్లె సంపూర్ణ, పల్లె రవి భార్యాభర్తలని చెప్పారు. సంపూర్ణకు గ్రామానికి చెందిన జాన్సన్ తో వివాహేతర సంబంధం ఉందన్నారు. తమ సంబంధానికి భర్త రవి అడ్డుగా ఉన్నాడని అతని హత్య చేసి అడ్డు తొలగించాలని ప్రియుడు జాన్సన్ కు సంపూర్ణ సూచించింది అన్నారు. ఎందుకు సఫారీగా లక్ష రూపాయలు చెల్లిస్తానని చెప్పిందన్నారు.

దీంతో జాన్సన్ పల్లె రవి హత్యకు ప్రణాళిక రూపొందించుకున్నాడు అన్నారు. ఇందుకోసం చిన్న ఆత్మకూర్ గ్రామానికి చెందిన నవీన్ తాండూర్ కు చెందిన చాకలి రాజు, మరో మైనర్ బాలులతో కలిసి కుట్ర పన్నాడన్నారు. ఈనెల 25వ తేదీ శుక్రవారం పల్లె రవికి డబ్బులు అప్పుగా ఇస్తామని, పెద్ద రెడ్డి గ్రామ శివారులో ఉన్న డంపింగ్ యార్డ్ వద్దకు రావాలని జాన్సన్ సూచించాడన్నారు.

అక్కడికి వచ్చిన పల్లె రవితో మద్యం తాగించారని, మత్తులో ఉన్న సమయంలో రవి పై సుత్తితో దాడి చేయడానికి నిందితులు ప్రయత్నం చేశారన్నారు. వారి నుంచి రవి తప్పించుకొని దగ్గర్లో ఉన్న ఫామ్ హౌస్ వైఫ్ కు పరిగెత్తాడని చెప్పారు. నిందితులు వెంబడించగా రవి ఫామ్ హౌస్ లోకి పరిగెత్తి ప్రాణాలు రక్షించుకున్నాడని డిఎస్పీ పేర్కొన్నారు. ఫామ్ హౌస్ లో ఉన్న సిబ్బంది వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారన్నారు.

వారు గాయపడిన రవిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు అని చెప్పారు. తన భర్తకు లక్ష రూపాయలు అప్పు ఇస్తానని జాన్సన్ చంపేందుకు ప్రయత్నించాడని పల్లె రవి భార్య సంపూర్ణ 26వ తేదీ నాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు.

దీంతో తమ సిబ్బంది కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ జరుపగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. నలుగురు నిందితులు,భార్య కలిసి భర్త రవి హత్యకు ప్రణాళిక రూపొందించిన విషయం వెల్లడైందని చెప్పారు


సంపూర్ణ తో పాటు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది అన్నారు. నిందితుల నుంచి హత్య చేసేందుకు ఉపయోగించిన సుత్తితోపాటు మూడు మొబైల్ ఫోన్లో రెండు ద్విచక్ర వాహనాలు రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి వివరించారు.

విలేకరుల సమావేశంలో సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ తో పాటు సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!