నిజామాబాదు: 30 జులై. మినిస్ట్రీ అఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మరియు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇంటిగ్రేటెడ్ రోడ్ ఆక్సిడెంట్ డేటాబేస్ (iRAD) గత నాలుగు సంవత్సరాలుగా పోలీస్ , రవాణా , రహదారుల విభాగాలకు ప్రమాదాలకు కారణాలని , వాటి మీద విశ్లేషణ ని అందిస్తుంది.
ఇందులో భాగంగా తెలంగాణ లో మొదటి సారి ప్రైవేట్ హాస్పిటల్స్ ని నిజామాబాదు జిల్లాలో iRAD అప్లికేషన్ లో ఈరోజు నమోదు చేయడం జరిగినది . దీని ద్వారా వివిధ విభాగాల వారు రోడ్డు ప్రమాదానికి సంబందించిన మెడికో లీగల్ సర్టిఫికెట్ , డిశ్చార్జ్ సమ్మరీ , పోస్టుమార్టుమ్ రిపోర్ట్స్ లు iRAD అప్లికేషన్ ద్వారా పొందవచ్చును.
తెలంగాణ లో మొదటిసారి నిజామాబాదు జిల్లా నుండి ప్రతిభ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ , సాయి శుభ హాస్పిటల్ , అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ వారు నమోదు చేసుకున్నారు , మిగితా వాటిని కూడా తొందరలో నమోదు చేయిస్తామని జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారి (DIO) S. మధు గారు తెలిపారు.
ఇట్టి అప్లికేషన్ ని ఉపయోగించుకుని ప్రమాదాల్ని విశ్లేషిస్తున్నామని నిజామాబాదు జిల్లా ని ప్రమాద రహిత జిల్లాగా చేయడమే వారి లక్ష్యం అని తెలిపినారు.
