HomeCRIMEపాత వీడియో వైరల్ …..పరుగులు పెట్టిన టాస్క్ ఫోర్స్ ……..విచారణ పేరుతొ రోజంతా ఠాణాలోనే బాధితుడు

పాత వీడియో వైరల్ …..పరుగులు పెట్టిన టాస్క్ ఫోర్స్ ……..విచారణ పేరుతొ రోజంతా ఠాణాలోనే బాధితుడు

నగరంలో ఓ రౌడీ షీటర్ తన జన్మ దినం రోజు తల్వార్ చేతిలో పట్టుకొని బైకు మీద ఉరేగించాడంటూ మీడియా హడలెత్తించింది. ఆ వీడియో దృశ్యాలను సైతం ప్రసారం చేసింది. వామ్మో అసలే కమిషనర్ నిజామాబాద్ నగరంలో రౌడీ మూకల ఆగడాల ఫై కఠినంగా ఉండలని స్పష్టంగా చెప్పడంతో ఆరో టౌన్ పోలీసులు బెదిరిపోయారు. మరో వైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు సదురు రౌడీ షీటర్ కోసం ఉరుకులు పరుగులు పెట్టారు .

ఎట్టకేలకు అతని ఇంటికి వెళ్లి విచారణ మొదలుపెట్టారు. అప్పుడే టాస్క్ ఫోర్స్ పోలీసులకు అసలు విషయం తెల్సి ఒక్కసారిగా డీలా పడ్డారు. అసలు తల్వార్ తో ఆ యువకుడు ఊరేగింది ఇప్పుడు కాదు సరిగ్గా అయిదేళ్ల కిందిదీ.అదేమిటి నిన్నే ఆ ఉరేగింపు జరిగిందంటూ మీడియా డంకా బజాయిస్తుంది కదా అంటూ టాస్క్ ఫోర్స్ అధికారులు విస్తుబోయారు.

తన జన్మ దినం నిన్నే వుండడం వల్ల తనంటే గిట్టని వారు ఆ పాత వీడియో ను వాట్సప్ లలో నుంచి తీసి పేస్ బుక్ లో వైరల్ చేసారని బాధితుడు వాపోయాడు. అసలు తనమీద ఎలాంటి రౌడీ షీట్ లేదని చెప్పాడు. స్థానిక పోలీసులను సైతం టాస్క్ ఫోర్స్ అధికారి అరా తీయడంతో ఆయన మీదే ఎలాంటి పిర్యాదులు లేవని స్పష్టం చేసారు.

కానీ విచారణ కు వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉత్తి చేతులతో వెళ్తే నామోషీ గా భావించారు. తల్వార్ తో ఊరేగిన వ్యక్తి తో పాటు అతని అన్న మరో తమ్మడి ని తమ వెంట తీసుకెళ్లారు టాస్క్ ఫోర్స్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మరిన్ని వివరాలు రాబట్టారు రాత్రి పదిగంటలు ఆరో టౌన్ కు పంపించారు. వ్యక్తిగత పూచి కత్తు మీద రాత్రి పదకొండు గంటలకు వదిలేసి మళ్ళీ బుధవారం ఉదయమే రావాలంటూ కండిషన్ పెట్టి వదిలేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments