ఆర్మూర్: రోడ్డు పక్కన వ్యవసాయ క్షేత్రం వద్ద నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మోర్తాడ్ మండలం దొన్కల్ క్రాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో శెట్పల్లి సహకార సంఘ చైర్మన్ రాజేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందారు.
ఆర్మూర్ నుండి మెట్పల్లి వెళ్తున్న బొలెరో రాజేశ్వర్ ను ఢీకొంది. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మోర్తాడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
