శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 8గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోకి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. సోమవారం ఉదయం ప్రాజెక్టు 8వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి విడిచి పెట్టారు .
ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయొద్దని ప్రాజెక్టు అధికారులు దండోరా వేయిస్తున్నారు.
