నామినేషన్ ల ఉపసంహరణ పక్రియ పూర్తిఅయింది. మంగళవారం నుంచి ఎన్నికల ప్రచారం హోరెత్తించడానికి ప్రధాన పార్టీలు ప్రణాళికలను ఖరారు చేసే పనిలోఉన్నారు.బడా నేతల సభలు రోడ్ షో లతో పాటు ఇంటిటా ప్రచారానికి సైతం అభ్యర్థులు తెరలేపారు.ముఖ్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారం ఉదృతం చేసింది. ఎంపీ అభ్యర్థి అర్వింద్ ఈపాటికే నియోజకవర్గాలవారీగా బూతు స్థాయి కార్యకర్తల సమావేశాలు పూర్తీ చేసారు.
మరో వైపు ఎన్నికల ప్రచారం చేయడానికి జాతీయ నేతలను జిల్లాకు రప్పించే కార్యాచరణలో అర్వింద్ ఉన్నారు. ప్రధాని మోడీ ని జిల్లాకు వచ్చేలా ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నారు. మోడీ జిల్లాకు వస్తే ఎన్నికలు ఏక పక్షం అవుతాయనే ధీమాలో ఉన్నారు. కానీ మోడీ ఎన్నికల షెడ్యూల్ రావడానికి వారం రోజుల ముందే నిజామాబాద్ లోకసభ పరిధిలోకి వచ్చే జగిత్యాల్ జిల్లాకు వచ్చారు.
ఒక్కో లోకసభ పరిధిలో ఒకే సభ లో మాత్రమే మోడీ షెడ్యూల్ ఖరారు అయింది. దీనితో మరోసారి ఇదే లోకసభ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల సభ ఖరారు చేయడం సాధ్యం కాదని పార్టీవర్గాలు చెప్తున్నాయి. మోడీ సభ కోసం ఓ కొలిక్కి రాకపోయినప్పటికీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాత్రం పర్యటన మాత్రం ఖరారు అయింది. ఈ నెల 5 న ఆయన జిల్లాలో సభ తో పాటు రోడ్ షో సైతం చేయనున్నారు.
ఇప్పటిదాకా అర్వింద్ ప్రచార పర్వం ను తన భుజాలమీద వేసుకొని దూసుకెళ్తున్నారు.జాతీయ నేతలు ఎంట్రీ ఇస్తే క్యాడర్ మరింత జోష్ పెరిగే అవకాశం ఉంది.
