అవినీతి నిరోధక శాఖ అధికారులవరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మున్సిపల్ అధికారులు ఆ శాఖను సమూలంగా ప్రక్షాళన కు నడుంకట్టారు.
ఈ మేరకు కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగారు రెండు రోజుల క్రితం ఆ విభాగం తో సుదీర్ఘ సమావేశం అయ్యారు. ఏసీబీ దాడులతో మున్సిపల్ శాఖ ప్రతిష్ట మసక బారుతున్న నేపథ్యంలో అయన కఠిన కార్యాచరణకు సిద్ధం అయ్యారు.
ఇక నుంచి కార్పొరేషన్ లోని రెవెన్యూ వ్యవస్థ ను తానే పర్యవేక్షిస్తానని స్పష్టం చేసారు రోజు వారీగా తానే రివ్యూ చేస్తానన్నారు.కార్పొరేషన్ కు ఆదాయం సమకూర్చాల్సిన ఈ విభాగం లో అలసత్వం అవినీతి వైఖరులు హెచ్చు మీరాయని రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తప్పవని కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు.
వార్డు లావారీగా రోజువారి వసూళ్లు మోటేషన్ పక్రియ లను తానే చూస్తానని పేర్కొన్నారు. అంతేకాదు అసలు రెవెన్యూ విభాగంలో పెండింగ్ లో ఉన్న మోటేషన్ ఫైళ్లు ను ఉన్నపలంగా కమిషనర్ స్వాధీనం చేసుకున్నారు.
గుట్టలుగా పేరుకు పోయిన ఫైళ్ల ను ఆయన తన ఛాంబర్ లో పెట్టుకున్నారు రోజువారీ ఆ ఫైళ్ల ను క్లియర్ చేయడానికి సమాయత్తం అవుతున్నారు భారిగా ముడుపులు ముట్టజెప్పినవారి మోటేషన్ ఫైళ్ల ను రెవెన్యూ అధికారులు క్లియర్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి.
దీనితో పాటు ఆయా నిర్మాణాలకు అష్టి పన్ను ఖరారు చేయడంలోనూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల కార్పొరేషన్ ఆదాయానికి గండి పడడమే కాదు కార్పొరేషన్ అప్రతిష్ట కు గురవుతుంది.
కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఏడాది లోనే కార్పొరేషన్ కార్యనిర్వహణ వ్యవస్థ ను గాడి పెట్టిన నేపథ్యంలో ఆయన వరుస ఏసీబీ కేసులు నమోదు కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు అందుకే సమూల ప్రక్షాళన కు నడుం కట్టారు
