నిజామాబాద్ సెప్టెంబర్ 9: జిల్లా బాస్కెట్బాల్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10న స్థానిక డిఎస్ఏ మైదానంలో ఉదయం 11:30 కు సబ్ జూనియర్స్ బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు బాస్కెట్బాల్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్ బొబ్బిలి నరేష్ లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 01_01_2012 నాడు తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు.
ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని వారు కోరారు ప్రతభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఈనెల 12న కే వి బి ఆర్ ఇండోర్ స్టేడియం హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపనున్నట్లు వారు తెలిపారు.
ఇతర వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ నిఖిల్ 9160036040 కు సంప్రదించాలని కోరారు.
