ఎన్ కౌంటర్ అయ్యాడంటూ ప్రచారం ……..సేఫ్ గానే ఉన్నాడని చెప్పిన సీపీ ……ఆసుపత్రి కి తరలింపు లో నాటకీయ పరిణామలు
ఘరానా దొంగ రియాజ్ అరబ్ వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.పట్టుబడిన నుంచి ఆసుపత్రి కి తెచ్చేదాకా అనేక ట్విస్టు లు జరిగాయి.
రియాజ్ ను ఎన్ కౌంటర్ చేసారంటూ పోలీస్ వర్గాల్లోనే విస్తృతంగా ప్రచారం జరిగింది. మీడియా లో నూ వచ్చింది. శనివారం రాత్రంతా నిజాంసాగర్ కాల్వ వద్ద పడిగాపులు పడేలా చేసిన రియాజ్ సారంగాపూర్ శివారు లోనే ఓ లారీ క్యాబిన్ లో షెల్టర్ తీసుకొవడం తో నివ్వెర పోయారు లారీ నుంచి దూకి పారిపోతున్న రియాజ్ మరోసారి కత్తి తో దాడికి తెగబడ్డాడు.
రియాజ్ పారిపోవడానికి సిద్ధం అయ్యాడు ఈ క్రమంలో నెహ్రు నగర్ కు చెందిన అసిఫ్ రియాజ్ ను పట్టుకోవడానికి వెళ్లగా తన వద్ద ఉన్న కత్తి తో దాడి చెయ్యడంతో ఎడమ చెయ్యి తెగింది. కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న ఆరో టౌన్ పోలీసులు హుటాహుటిన రియాజ్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు.
అక్కడి నుంచి వాహనంలో తీసుకెళ్లారు. కానీ అతని ఎక్కడికి తీసుకెళ్లింది బయటికి పొక్క నీయలేదు. దాదాపు రెండు గంటల పాటు ఉత్కంఠ కొనసాగించారు. చివరికి రియాజ్ ను పోలీస్ శిక్షణ కేంద్రం వైవు తీసుకెళ్లారని సమాచారం వచ్చింది.
అతని ఓ కీలక అధికారి వద్ద కు తీసుకెళ్లిన కొద్దీ సమయానికే రెండు రౌండ్లు కాల్పులు జరిగాయి రియాజ్ మరోసారి కూడా తప్పించుకునే ప్రయత్నం చేసారని దీనితో కాల్పులు జరిపారనేది పోలీస్ వర్గాల్లో ప్రచారం జరిగింది.
విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ నడి రోడ్డు లో హత్య చేసిన నిందితుడి ఎన్ కౌంటర్ ఖాయమని వారంతా భావించారు. కానీ అనూహ్యంగా రియాద్ ఎన్ కౌంటర్ కాలేదని ప్రాణాలతో తమ అదుపు లోనే ఉన్నారని కమిషనర్ సాయి చై తన్య నుంచి ప్రకటన వచ్చింది. దీనితో ఒక్కసారి కలకలం మొదలయింది.
కొద్దీ సేపటికే రియాద్ ను జిల్లా ఆసుపత్రికి తరలించారు ఎవ్వరు కల్వకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసారు. ఉన్నతిధికారుల సూచన మేరకే రియాజ్ ను చికిత్స కోసం ఆసుపత్రి కి తరలించారు
