మావోయిస్ట్ పార్టీకి చెందిన మరో 21 మంది నక్సలైట్లు ఆదివారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాలకు చెందిన డివిజన్ కమిటీల నాయకులు, పలువురు ముఖ్యులు సహా మొత్తం 21 మంది నక్సలైట్లు ప్రభుత్వానికి సరెండరయ్యారు.
కాంకేర్ , నారాయణ్ పూర్ జిల్లాలో 21 మంది లొంగిపోగా, వీరిలో 13 మంది మహిళా నక్సల్స్ ఉన్నారు.వీరి వద్ద ఉన్న మూడు AK-47 రైఫిల్స్, నాలుగు SLRలు, రెండు INSAS రైఫిల్స్, ఆరు .303 రైఫిల్స్, రెండు సింగిల్-షాట్ రైఫిల్స్, ఒక BGL లాంచర్తోసహా 18 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.
బస్తర్ రేంజ్ సీనియర్ పోలీస్ అధికారుల సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది. ఈ బృందంలో డివిజన్ కమిటీ సెక్రటరీ ముకేశ్తో సహా నలుగురు డివిజన్ కమిటీ సభ్యులు తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు ఎనిమిదిమంది పార్టీ సభ్యులు ఉన్నారు.
