HomeCRIMEసీపీ సీరియస్ ....రౌడీ మూకల ఫై ఇక నుంచి ఉక్కుపాదమే ....సమద్ టీం కోసం గాలింపు...

సీపీ సీరియస్ ….రౌడీ మూకల ఫై ఇక నుంచి ఉక్కుపాదమే ….సమద్ టీం కోసం గాలింపు ? …….సీసీఎస్ లో సమద్ కు బలమైన నెట్ వర్క్ ? సమద్ చిక్కితే మరింత ప్రమోద్ హత్యలో మరింత స్పష్టత..

కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య కమిషనర్ సాయి చైతన్య చలించి పోయారు. ఈ ఘాతుకానికి పాల్పడిన రియాజ్ ఎన్ కౌంటర్ లో హతం అయ్యారు.

ఈ రెండు ఘటనలకు సంబంధించి పోలీస్ శాఖ లో అంతర్మథనం మొదలైంది.రియాజ్ హతం అయ్యాక పోలీసులు రిలాక్స్ అవుతారని అంత భావించారు కానీ నగరంలో చెలరేగి పోతున్న రౌడీ మూకల మీద మరింత కఠినంగా వ్యవహరించే దిశ గా కార్యాచరణ మొదలైంది.

కమిషనర్ సాయి చైతన్య రగిలి పోతున్నారు. ముందుగా రియాజ్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర ఉన్న సమద్ గ్యాంగ్ కోసం సీపీ వేట మొదలు పెట్టారు. రియాజ్ ప్రమోద్ ను హత్యచేసాక అంతకుముందు సమద్ తో టచ్ లో ఉన్నట్లు నిర్ధారణ అయింది.

గతంలో ఓ హత్య కేసులో నిందితుడి గా ఉన్న సమద్ సెటిల్ మెంట్ దందా ల్లో ఆరితేరాడు. రియాజ్ తో కల్సి పనిచేసాడనేది పోలీసులవిచారణలో వెల్లడయింది. అందుకే సమద్ ను పట్టుకొని విచారిస్తే ఇంకా కీలక విషయాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.

రియాజ్ ప్రమోద్ ను హత్య చేసి కత్తి కూడా సమద్ నుంచే తీసుకున్నాడట. అసలు రియాజ్ కానిస్టేబుల్ ప్రమోద్ ఎందుకు హత్య చేసాడనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ఎందుకంటే రియాజ్ జస్ట్ చిల్లర దొంగతనాలే చేసేది.

అదికూడా బైకు లే ! అదే ధీమాతో ప్రమోద్ కూడా రియాజ్ ను ఎలాంటి సోదాలు చెయ్యకుండా బైకు మీద కూర్చోబెట్టున్నాడు. ఆస్థి గొడవల్లో వరుసకు అన్న మీద దాడి చేసాడు. మరీ అలాంటి రియాజ్ ఏకంగా కానిస్టేబుల్ నే హత్య చేయడానికి ఎలా తెగించాడు.

ఈ తెగింపు వెనుక ఎవరున్నారనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. అందుకే సమద్ ను పట్టుకొని విచారించడం పోలీసులు అనివార్యంగా భావిస్తున్నారు. అందులోనూ సమద్ కు సీసీఎస్ లో బలమైన నెట్ వర్క్ ఉంది.

ఇద్దరు కీలక అధికారులతో గట్టి సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యం. రియాజ్ ను పట్టుకోవడానికి ముందు ఏమి జరిగిందనేది తేలాల్సి ఉంది. మరో వైపు ప్రమోద్ హత్య ఇంకా జీర్ణించుకోలేక పోతున్న సీపీ రౌడీ మూకల గట్టిగా నియంత్రించాలని భావిస్తున్నారు. సమద్ గ్యాంగ్ తో ఇందుకు శ్రీకారం చుట్టారు ఎలాగైనా సమద్ ను పట్టు కోవాలని సీసీఎస్ నే పురమాయించారు.

నిజానికి ప్రమోద్ హత్య జరిగిన రాత్రి నుంచే సమద్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు . కోటగిరి వర్ని ప్రాంతాలకు మకాం మార్చిన సమద్ అక్కడి నుంచే నగరంలో కార్యకలాపాలు సాగించేది .కేవలం వాట్సప్ ను మాత్రమే వాడే సమద్ హత్య జరిగిన తర్వాత సీసీ యస్ పోలీసులు తన కోసం గాలిస్తున్నారం తెల్సి పూర్తిగా అజ్ఞాతం లోకి వెళ్ళాడు.

కేవలం ఇనిస్టాగ్రమ్ లో ఒకరిద్దరికి టచ్ లో ఉన్నాడు గత నాలుగు రోజులుగా సీసీ యస్ బృందాలు అదే పనిగా గాలిస్తున్నాయి. కానీ అదే సీసీ యస్ లో సమద్ కు బలమైన నెట్ వర్క్ ఉంది.

కానీ ప్రతికూల పరిస్థితులనైన అధిగమించి సమద్ ను పట్టుకోవాలనేది సీపీ తెగేసి చెప్తుండడంతో సీసీఎస్ బృందాలు సమద్ వేటలో చెమటోడుస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments