HomeTelanganaNizamabadఅర్వింద్ రాజీనామా చేస్తేనే బీసీ బిల్లు కు మోక్షం .....మాదవనగర్ వంతెన ఎందుకు అయితలేదు...

అర్వింద్ రాజీనామా చేస్తేనే బీసీ బిల్లు కు మోక్షం …..మాదవనగర్ వంతెన ఎందుకు అయితలేదు // తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ఎంపీ పదవికి అర్వింద్ రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్ల బిల్లు మోక్షం వస్తుందని వస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జోస్యం చెప్పారు. ఆదివారం నగర శివారులోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లు కోసం ధర్మపురి అరవింద్ పదవి త్యాగం కోసం ముందుకు రావాలన్నారు. ఆయనతో సహా రాష్ట్రంలోని ఎనిమిది మంది ఎంపీలంతా కలిసి రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు నడుచుకుంటూ వస్తుందని ఆమె జోస్యం చెప్పారు.

గతంలో మాధవ్ నగర్ బ్రిడ్జి ఎందుకు అవడం లేదని ఎక్కువ మాట్లాడే వారిని కానీ ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం పోయి రెండేళ్లు అయ్యింది. మళ్లీ అరవింద్ ఎంపీగా గెలిచిన మాధవ్ నగర్ బ్రిడ్జి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని హితవు పలికారు.

అప్పుడు తనను కే టాక్స్ అనేవాడని, మరి ఇప్పుడు ఏం టాక్స్ వసూలు చేస్తున్నారూ,మీ టాక్స్ వసూళ్లు చేస్తున్నారా అని ప్రశ్నించారు. మాధవ నగర్ బ్రిడ్జి పనులు నిర్మాణం కోసం మీరు ధర్నా చేస్తారో,లేక సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూర్చుంటారో లేదా మోడీ ఇంటి ముందు కూర్చుంటారో కానీ వెంటనే బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

శనివారం జాగృతి జనం బాటకు కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, ప్రజలు కూడా అండగా ఉంటారని పేర్కొన్నారు.ఇక శనివారం నవీపేట మండలం యంచ గ్రామంలో వెళ్లి పరిశీలించగా ముంపు బాధిత రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.సుమారు 5 వేల ఎకరాల్లో పంట నష్టపోయిందని అయిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాధ్యత తీసుకోవడం లేదని ఆగ్రహించారు.

రాజకీయాలు పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఉమ్మడి జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల మక్కరైతులు ప్రైవేట్ వ్యాపారులతో నిలువు దోపిడీకి గురయ్యారని తెలిపారు.సుమారు 80 శాతం మంది దళారులకు అమ్ముతున్నారని స్పష్టం చేశారు.

అలాగే మక్కకు కూడా కనీస మద్దతు ఇస్తామని చెప్పినా ఇవ్వడం లేదన్నారు. గత వారం రోజు లాగా కొనుగోలు కేంద్రంలో పేరిట ప్రభుత్వం హడావుడి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అలసత్వం వల్ల క్వింటాలుకు రూ.700 నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

అలాగే బోనస్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇక వారి అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్ద అవుతుందని ప్రభుత్వం ప్రతి చివరి గింజ వరకు ఎలాంటి తరుగు లేకుండా కొనాలని డిమాండ్ చేశారు. అలాగే మొన్న యాసంగిలో కూడా రైతులకు బోనస్ ఇవ్వకుండా మోసం చేసిందని ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరికి బోనస్ ఇవ్వాలని తెలిపారు..

ఇక ఓ బీజేపీ ఎంపీ నాపై నా కుటుంబం పై విమర్శలు చేశారని అన్నారు. అన్ని ఆధారాలతో వారి చిట్టా విప్పి మీడియా ముందు పెడతానని హెచ్చరించారు.అవకాశం, అధికారం, ఆత్మగౌరవం కోసమే తెలంగాణ జాగృతి పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచంలో అనేక ఉద్యమాలు జరిగాయి.

కానీ విజయాన్ని ముద్దాడినవి కొన్ని అని తెలిపారు. అదే తరహాలో ఇప్పుడు జాగృతి అవకాశం అధికారమాత్మ గౌరవం అని నిదానంతో సామాజిక తెలంగాణతో ముందుకు వెళుతున్నామన్నారు. అన్ని అవకాశాలు అందరికీ వాటా ఉండాలని అధికారంలో అందరికీ వాటా రావాలని ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి జరగాలని నిదానంతో ముందుకు వెళుతున్నామన్నారు.

రాష్ట్రంలో కాంట్రాక్ట్లకు ప్రతినెల డబ్బులు ఇస్తున్నారని కానీ ఫీ రీయింబర్స్ మెంట్ కు మంజూరు చేయడంలేదని అన్నారు.దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం లో మైనార్టీకి, ఎస్టీ లంబాడా కి ఒక్క మంత్రి పదవి లేకపోవడం ఇదే మొట్టమొదటి సారి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాగృతి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments