నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తయారీకి వినియోగించే అల్ఫా జోలంను నార్కోటిక్ ఇన్స్పెక్టర్ పూర్ణేశ్వర్ ప్రత్యేక టీం ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ మేరకు నిజామాబాద్ శివారులోని మోపాల్ మండల పరిధిలో దాడులు నిర్వహించారు.
మోపాల్ మండలంలోని తాడే రోడ్డులో సాగర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్ లు తమ కల్లు డిపో కు వెళ్తుండగా మార్గమధ్యంలో నార్కోటిక్ బృందం అతన్ని పట్టుకొని తనిఖీ చేశారు.
అనంతరం మోపాల్ మండల పరిధిలో గల కల్లు డిపో వద్ద రూ.5 లక్షల విలువ చేసే సుమారు 500 గ్రా.ల అల్ఫ్రోజ్ జోలం ను సీజ్ చేశారు. ఈ మేరకు పట్టుబడిన ఇద్దరిని కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం, మోపాల్ ఎస్సైకి అప్పగించినట్లు సమాచారం.
