జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎవరికి దక్కనున్నాయనేది ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. తుది కసరత్తు పూర్తీ అయింది. ముగ్గురు పేర్లతో జాబితా అధిష్టానం కు చేరింది. అర డజన్ మంది నేతలు డీసీసీ కోసం అధ్యక్ష పదవి కోసం దరకాస్తు చేసుకున్నారు.
ఈసారి గతంలో కన్న బిన్నంగా విస్తృతమైన సంప్రదింపుల పక్రియ జరిగింది నేరుగా ఏఐసీసీ నే పరిశీలకులను రంగంలోకి దించింది. ఆయన వచ్చి నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరిపి కీలక నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరు బాగుంటారని వాకబు చేసారు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సొంత జిల్లా కావడంతో పక్కగా ఈ పక్రియ నిర్వహించారు. ఈ వ్యవహారంలో ఆయన కూడా ఎక్కడా నేరుగా జోక్యం చేసుకోలేదు. డీసీసీ అధ్యక్షుడి గా ఎవరుండాలనే విషయంలో మహేష్ తో పాటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వర్గీయులే హడావుడి చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి లతో పాటు శేఖర్ గౌడ్ లు డీసీసీ రేసులో చివరి దాక నిలిచారు ఏఐసీసీ కి వెళ్లిన జాబితా లో ఈ ముగ్గురు నేతలే ఉన్నారు. వీరిలో నర్సారెడ్డి నగేష్ రెడ్డి లు సుదర్శన్ రెడ్డి వర్గీయులుగా ముద్ర ఉంది.
శేకర్ గౌడ్ ఒక్కరే మహేష్ సన్నిహితుడు. అందుకే ఈ ముగ్గురి లో డీసీసీ పగ్గాలు ఎవరికీ అప్పగించబోతున్నారనేది ఉత్కంఠ గా మారింది. బీసీ లకు 42 శాతం కోసం మొదటి గట్టిగా గొంతెత్తిన మహేష్ గౌడ్ సొంత జిల్లా లో డీసీసీ బీసీ కి దక్కుతుందా? లేదా ? అనే చర్చ ఉంది.
బీసీ రిజర్వేషన్ తేలాకే ఎన్నికలు జరగాలని పట్టుబడుతున్న మహేష్ సొంత జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి బీసీ కి వచ్చేలా మంత్రాంగం నడుపడుతారా లేదా అనేది పార్టీ వర్గాలకు ఆసక్తి గా మారింది. అందులోను గత ఎనిమిదేళ్లుగా డీసీసీ అధ్యక్షుడి గా రెడ్డి సామజిక వర్గం కు చెందిన మనలా మోహన్ రెడ్డి ఉన్నారు.
గతంలో మైనార్టీ అంతకు ముందు ఎస్సి వర్గాలకు చెందిన తాహెర్ గడుగు లు సుదీర్ఘ కాలం పనిచేసారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బీసీ నేత కు డీసీసీ గా అవకాశం దక్కలేదు. పీసీసీ చీఫ్ గా డీఎస్ రెండు పర్యాయాలు పనిచేసిన ఆ ఛాన్స్ రాలేదు.
ఈసారి మహేష్ పీసీసీ చిప్ గా ఉన్న నేపథ్యంలో ఈసారైనా బీసీ లకు అవకాశం ఇవ్వాలని మహేష్ ఆయన సన్నిహితులేఒత్తిడి చేస్తున్నారు. బీసీ కి ఇవ్వడం అని వార్యంగా భావిస్తే శేఖర్ గౌడ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
