ఎమ్మెల్సీ కవిత తన పార్ట్ నర్ రేవంత్ తో సీఎం పదవికి రాజీనామా చేయిస్తే బీసీ రిజర్వేషన్ వచ్చి తీరుతుండం ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేసారు. వారిద్దరూ వ్యాపార భాగస్వాములే నన్నారు.
అందుకే ఇప్పడు రేవంత్ డైరెక్షన్ లో పనిచేస్తుందని ఆమె తో పార్టీకూడా పెట్టించబోతున్నాడనున్నారు. మాదవనగర్ వంతెన ఆగిపోవడానికి కూడా కవిత పార్ట్ నర్ రేవంతే నిధులు ఆపేశాడన్నారు.
కవిత కు ముడుపులు భయంతో నే గుత్తేదారు పారిపోయాడని అర్వింద్ అన్నారు అలాంటి దిక్కుమాలిన చరిత్ర నీ దని అదే ప్రజలముందు పెట్టాను అందుకే తీహార్ జైలు గతి పట్టిందన్నారు.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఎందుకు ఆమోదం తెలపడం లేదని మండలి ఛైర్మెన్ కు ఏ ములాఖత్ వుందన్నారు పైగా ఆమె కు ఫోన్ చేసి ఓదార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు.
అందుకే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి కూడా మండలి ఛైర్మెన్ కు లేఖ రాసారని సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం ప్రస్తావించారని అర్వింద్ పేర్కొన్నారు. రియంబర్స్ మెంట్ ఇవ్వకుండా బీసీ ఎస్సి ఎస్టీ లను చదువులకు దూరం చేసిందే కల్వకుంట్ల కుటుంబం కదా ! కవిత వెళ్లి కెసిఆర్ ముక్కు పిండాలన్నారు.
ఏనాడూ వార్డ్ మెంబర్ కూడా గెలవని మహేష్ కేంద్రం నిధులు ఇవ్వలేదంటున్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ పసుపు బోర్డు ఛైర్మెన్ గంగారెడ్డి మాజీ మున్సిపల్ ఛైర్మెన్ గంగాధర్ లు పాల్గొన్నారు
