పీసీసీ చీఫ్ సొంత జిల్లా లో డీసీసీ అధ్యక్షుడి నియామకం ఆసక్తి గా మారింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ లో ఆధిపత్యం కోసం ఎవరికి వారే ఎత్తుగడలు వేస్తున్నారు. తాను సిఫారస్ చేసిన వ్యక్తి కే డీసీసీ పగ్గాలు దక్కేలా సుదర్శన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
కానీ పీసీసీ చీఫ్ మహేష్ వ్యూహం ఎవరికి అంతు చిక్కడం లేదు. మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షడు నగేష్ రెడ్డి కోసం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు.
అభిప్రాయసేకరణలో మెజార్టీ నేతలు నగేష్ రెడ్డి పేరు చేప్పేలా చక్రం తిప్పారు. ఆయన మాట కాదనలేక ఆర్మూర్ బాల్కొండ సెగ్మెంట్ లలో కొందరు నేతలు నగేష్ పేరు చెప్పారు.
పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఆమోదం ఉన్న వారే అవుతారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. బాడ్సి గ్రామానికి చెందిన సీనియర్ నేత శేఖర్ గౌడ్ మహేష్ వర్గీయుడిగా ముద్ర ఉంది.
చివరిలో ఆయన డీసీసీ రేసులోకి వచ్చారు. విస్తృతమైన సంప్రదింపుల పక్రియ జరిగింది. ఏఐసీసీ ప్రతినిధి వచ్చి నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరిపి కీలక నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరు బాగుంటారని వాకబు చేసారు..
మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి లతో పాటు శేఖర్ గౌడ్ లు డీసీసీ రేసులో చివరి దాక నిలిచారు ఏఐసీసీ కి వెళ్లిన జాబితా లో ఈ ముగ్గురు నేతలే ఉన్నారు. వీరిలో నర్సారెడ్డి నగేష్ రెడ్డి లు సుదర్శన్ రెడ్డి వర్గీయులుగా ముద్ర ఉంది. శేకర్ గౌడ్ ఒక్కరే మహేష్ సన్నిహితుడు.
అందుకే ఈ ముగ్గురి లో డీసీసీ పగ్గాలు ఎవరికీ అప్పగించబోతున్నారనేది ఉత్కంఠ గా మారింది. బీసీ లకు 42 శాతం కోసం మొదటి గట్టిగా గొంతెత్తిన మహేష్ గౌడ్ సొంత జిల్లా లో డీసీసీ బీసీ కి దక్కుతుందా? లేదా ? అనే చర్చ ఉంది.
బీసీ రిజర్వేషన్ తేలాకే ఎన్నికలు జరగాలని పట్టుబడుతున్న మహేష్ సొంత జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి బీసీ కి వచ్చేలా మంత్రాంగం నడుపడుతారా లేదా అనేది పార్టీ వర్గాలకు ఆసక్తి గా మారింది. అందులోను గత ఎనిమిదేళ్లుగా డీసీసీ అధ్యక్షుడి గా రెడ్డి సామజిక వర్గం కు చెందిన మనలా మోహన్ రెడ్డి ఉన్నారు.
గతంలో మైనార్టీ అంతకు ముందు ఎస్సి వర్గాలకు చెందిన తాహెర్ గడుగు లు సుదీర్ఘ కాలం పనిచేసారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బీసీ నేత కు డీసీసీ గా అవకాశం దక్కలేదు. పీసీసీ చీఫ్ గా డీఎస్ రెండు పర్యాయాలు పనిచేసిన ఆ ఛాన్స్ రాలేదు.
ఈసారి మహేష్ పీసీసీ చిప్ గా ఉన్న నేపథ్యంలో ఈసారైనా బీసీ లకు అవకాశం ఇవ్వాలని మహేష్ ఆయన సన్నిహితులేఒత్తిడి చేస్తున్నారు. కానీ అభిప్రాయసేకరణలో నగేష్ కోసం ఆయా నియోజకవర్గ నేతలను ఒత్తిడి చేసిన సుదర్శన్ రెడ్డి ఈసారి ఢిల్లీ స్థాయిలోనూ మంత్రాంగం నడుపుతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
సీఎం రేవంత్ సైతం ఈసారి డీసీసీ విషయంలో సుదర్శన్ రెడ్డి మాట నెగ్గేలా చక్రం తిప్పుతారంటున్నారు. మంత్రి పదవి దక్కలేదని ఇప్పటికే తీవ్ర నిరాశ లో సుదర్శన్ రెడ్డి డీసీసీ విషయంలో ఊరట దక్కేలానేది రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉందట ?
