Thursday, April 16, 2026
HomePOLITICAL NEWSkamareddyషబ్బీర్ మంత్రి పదవి చేజారినట్లేనా .........అసంతృప్తి రగులుతున్న దిగ్గజ నేత ......

షబ్బీర్ మంత్రి పదవి చేజారినట్లేనా ………అసంతృప్తి రగులుతున్న దిగ్గజ నేత ……

మంత్రి పదవి షబ్బీర్ అలీ చేజారి పోయింది. జూబ్లీహిల్స్ లో ఓడిపోయినా అజారోద్దిన్ ను అనూహ్యంగా మంత్రి పదవి దక్కడం తో షబ్బీర్ మంత్రి ఆశలు అడియాశలు అయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న ఆయన ఇప్పడు అసంతృప్తి తో రగిలి పోతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతానంటూ తనను దూరం పెట్టిన అధిష్టానం ఓడిన నేతకే మంత్రి పదవీ కట్టబెట్టడం తో ఆయన లోలోపల రగిలి పోతున్నారు.

అసలే మంత్రి పదవి రాలేదని మండి పోతున్న షబ్బీర్ కు పుండుమీద కారం చల్లి నట్లుగా జిల్లాకు మరో సలహాదారు పదవి ఇవ్వడం తో ఆయన అసలే జీర్ణించుకోలేక పోతున్నారు.

పీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం అందరికన్నా ముందు అండగా నిల బడింది షబ్బీరే అందుకే కెసిఆర్ కామారెడ్డి లో పోటీ చెయ్యడానికి సిద్ధం అయితే రేవంత్ పోటీ చెయ్యడానికి తన టికెట్ ను త్యాగం చేసారు షబ్బీర్ అలీ.

మైనార్టీ కోట లో టికెట్ లు సర్దుబాటు చెయ్యాలనే ఆలోచనతో షబ్బీర్ ను మూడు రోజులు ముందు నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దించింది. సరైన ప్రణాళిక లేక పోవడం అత్యంత దగ్గరగా ఉన్న నేతలే నిండా ముంచేయడంతో ఓడిపోయారు.

కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సరే సీఎం అయ్యాక రేవంత్ షబ్బీర్ ను చేరదీశారు. మంత్రి హోదా ఉండే సలహాదారుడి నియామకం చేశారు. రాజకీయంగా కొంత లో కొంత ఊరట దక్కింది. క్యాబినెట్ లో మైనార్టీ కోట బెర్త్ ఇంకా ఖాళీగా ఉండడంతో ఎప్పటికైనా మంత్రి యోగం దక్కతుందనే ఆశతో ఎమ్మెల్సీ కోసం సర్వ శక్తులే ఒడ్డారు.

రేవంత్ సైతం అనేక మార్లు ఎమ్మెల్సీ చేస్తాననే హామీ ఇచ్చాడు కూడా. కానీ సామజిక సమీకరణ లతో ఆయన కు ఎమ్మెల్సీ పదవి దక్క లేదు. వచ్చే మార్చ్ లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న షబ్బీర్ అలీ కి అజార్ రూపం లో ఝాలాక్ ఇచ్చింది అధిష్ఠానం.

మొదట అమీర్ అలీ గవర్నర్ కోట లో ఎమ్మెల్సీ గా నామినేటెడ్ చేసిన అధిష్టానం ఆయను పక్కకు తప్పించి అజారోద్దిన్ కు అవకాశం ఇచ్చింది. కానీఅజర్ ఎమ్మెల్సీ ప్రతిపాదనలు గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉంది.

ఈలోపు ఆయన కు క్యాబినెట్ లో బెర్ట్ దక్కింది. రేవంత్ క్యాబినెట్ లో రెండేళ్లుగా ఖాళీగా ఉన్న మైనార్టీ కోట భర్తీ అయింది. దీనితో షబ్బీర్ అలి మంత్రి పదవి దక్కడం అంత సులువేమి కాదు. మంత్రి పదవి సంగతి ఎలా ఉన్నా అసలు ఎమ్మెల్సీ అవకాశాలు ఉన్న సన్నగిల్లి నట్లే .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!