Thursday, April 16, 2026
HomeCRIMEచోరి కేసును 48 గంటలలో చేదించిన ఒకటవ టౌన్ పోలీసులు.

చోరి కేసును 48 గంటలలో చేదించిన ఒకటవ టౌన్ పోలీసులు.

దొంగలించిన సొమ్మును అమ్ముటకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్..నిజామాబాద్ నగరంలోని చోరి కేసును 48 గంటలలో ఒకటవ టౌన్ పోలీసులు ఛేదించారు.

ఈ నేపథ్యంలో నిందితులు చోరి చేసిన సొమ్మును అమ్ముటకు వచ్చిన ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.

నిజామాబాదు ఖోజా కాలనీకి చెందిన అతర్ బైగ్ @ మీర్జా అతర్ బైగ్ @ అత్తు, షేక్ అజ్మాద్ @ అహూ ఇద్దరు నేరస్తులు మందు, సిగరెట్, గుట్కా వంటి చెడు అలవాట్లు బానిసై వారు పని చేయగా వచ్చిన డబ్బులు నా జల్సా లకు, చెడు అలవాట్లకు సరిపోవడం లేదని

ఒంటరిగా కనిపించే వారిని బెదిరించి వారిని కొట్టి వారి దగ్గర డబ్బులు లేదా ఎవైన విలువైన వస్తువులు దొంగతనం చేద్దామని లేదంటే ఇళ్ళల్లో దొంగతనాలు చేసి దోచుకున్న డబ్బులతో జల్సాకు, చెడు అలవాట్లకు వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో, వారు అక్టోబర్ 31 న ఎరుకలవాడ లోని ఒక ఇంటిలోకి వెళ్లి బీరువాలో పగలగొట్టి బంగారు ఆభరణాలు, Rs.1500/- రూపాయల నగదును, ఒక ఫోన్ ను చోరి చేసి పరారాయరని తెలిపారు.

ఈ మేరకు వారు దొంగలించిన సొమ్మును ఎవరికైనా అమ్ముటకు ఆదివారం గంజ్ మార్కెట్ లో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించగా, వారిని పట్టుకొని వారి వద్ద నుండి బంగారు ముక్కు పుడక ఉంగరం, వెండి కడియాలు, ఒత్తులు, స్మార్ట్ ఫోన్, Rs. 1500/- రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే వీరిపై ఇదువరకే దొంగతనాల కేసులు, హత్యాయత్నం కేసులు ఉన్నాయని తెలిపారు.

ఈ కేసును చేధించడంలో ఒకటవ టౌన్ సిఐ రఘుపతి పర్యవేక్షణలో వన్ టౌన్ ఎస్ఐ మహేష్, ఏఎస్ఐ షకీల్, కానిస్టేబుల్లు గంగారం, ప్రభురాజ్ లను, నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి అభినంధించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!