HomeCRIMEకొలిక్కి వచ్చిన మహిళా సజీవ దహనం కేసు .....డబ్బు తగాదా తో నే..

కొలిక్కి వచ్చిన మహిళా సజీవ దహనం కేసు …..డబ్బు తగాదా తో నే..

ముగ్గరు స్నేహితులమధ్య డబ్బుల వ్యవహారంలో తెలెత్తిన వివాదంలోనే మహిళ సజీవ దహనం జరిగింది. ఇటీవల నవీపేట్ మండలం ఫతేనగర్ లో గత నెల 24 మహిళా సజీవదహనం కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చింది.

రూరల్ సీఐ శ్రీనివాస్ కథనం మేరకు.. అక్టోబర్ 24 న ఫతే నగర్ గ్రామ సరిహద్దులో పెట్రోల్ పోసి కాలబెట్టిన శ్యామల లక్స్మీ @ బుజ్జి శవం ఉందని ఫిర్యాదు రాగా, కేసు నమోదు చేసి నిందితుల కోసం దర్యాప్తు చేస్తుండగా, బుదవారం ఫకీరాబాద్ కు సంబంధించిన ముగ్గురిని (ఇద్దరు మహిళలు సంగీత, పద్మ, బాబు)లను అదుపులో తీసుకొని విదారించగా గతంలో మృతురాలు అయిన శ్యామల లక్ష్మీ @ బుజ్జి మరియు ఫకీరాబాద్ కు చెందిన సంగీత, బాబు, పధ్మల మద్య చాలా రోజుల నుంచి పరిచయం వుండగా ఒకరి ఇంటికి ఒకరు వెళుతూ అందరు కలిసి పని చేసుకొనేవారనీ తెలిపారు.

అయితే కొద్ది రోజులనుండి వారి మధ్య డబ్బుల గురించి గొడవలు జరుగుతుండగా ఆమెను చంపాలనే పథకం ప్రకారం నిర్మానుష్య ప్రదేశంలోకి కల్లూ త్రాగటానికి తీసుకొని వెళ్ళి తగిన తరువాత మద్యం మత్తులో వున్న శ్యామల లక్ష్మీ @ బుజ్జి ని సంగీత మిగితా ఇద్దరీ సహాయంతో గొంతు నులిమి హత్య చేసి వాళ్ళుముందుగానే తెచ్చిన పెట్రోల్ పోసి తగాలిపెట్టారనీ పేర్కొన్నారు.

ఈ కేసు చేధనకు నిజామాబాదు నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్ అధ్వర్యంలో టీం లుగా ఏర్పడి, కేసును వివిధ కోణాలలో పరిశోధించి ఈ హత్య కేసులో నిందితులు గా ఉన్న గొల్ల సంగీత, మంగళ్ బాబు, బాధవత్ పద్మ ల ను పట్టుకున్నట్లు తెలిపారు.

నిందితులను పట్టుకున్న నవీపేట్ ఎస్సై తిరుపతి, యాదగిరిగౌడ్, రాజశేకర్ , గఫార్ ఏఎస్సీ, రాజేశ్వర్ క్రైమ్ టీమ్ & నవీపేట్ పిఎస్ సిబ్బందిని నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments