రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇందూరు నగరం లో మహా పథ్ సంచలన్ ఆదివారం ఘనంగా నిర్వహించారు.నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో ఉన్న హెచ్పీఎస్ పాఠశాల నుంచి కార్యక్రమం ప్రారంభమైంది.
కాషాయ ధ్వజానికి ప్రణామం చేసిన అనంతరం చంద్రశేఖర్ కాలనీ(కంఠేశ్వర్ రోడ్ నుంచి ఉమెన్స్ కాలేజ్ మీదుగా తిరిగి హెచ్ పి యస్ వచ్చారు.స్వయం సేవకులతో నిర్వహించిన కావత్ అందరిని ఆకట్టుకుంది
ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యవక్తగా విచ్చేసిన ఇందూర్ విభాగ ప్రచారక్ శివకుమార్ మాట్లాడుతూ దేశంలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి నిరంతరం శ్రమిస్తోందన్నారు. సమాజంలో చైతన్యాన్ని నింపి ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలవడానికి ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విభాగ ప్రచారక్తో పాటు జిల్లా సంఘచాలకులు డాక్టర్ కాపర్తి గురుచరణం, నగర కార్యవాహ అర్గుల సత్యం, విభాగ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్, ఉప కార్యవాహ వెంకటేష్, సుమిత్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
