HomeTelanganaNizamabadతండాల్లో పంచాయితీ ఎన్నికలు….సర్పంచ్ పదవికి వేలంపాట…రూ 13 లక్షలకు దక్కిచుకున్న ఎమ్మెల్యే అనుచరుడు ……..చిన్న తండాకు...

తండాల్లో పంచాయితీ ఎన్నికలు….సర్పంచ్ పదవికి వేలంపాట…రూ 13 లక్షలకు దక్కిచుకున్న ఎమ్మెల్యే అనుచరుడు ……..చిన్న తండాకు అన్యాయమైతుందని ఆరోపణ…

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గోకుల్ తండా పంచాయతీ పరిధిలో పెద్దతాండ, చిన్న తాండ రెండు కలవు. పెద్దతాండ పరిధిలో దాదాపు నాలుగు వందల వరకు ఓటర్లు ఉన్నారు. చిన్న తాండ పరిధిలో 250 ఓటర్లు ఉన్నారు.

పెద్దతండవారు సర్పంచ్ పదవిని వేలంపాట వేయగా, పెద్ద తాండకు చెందిన ఓ వ్యక్తి రూ.13 లక్షల 40వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. అభివృద్ధిలో భాగంగా చిన్న తండాకు వాటా అడిగితే ఇవ్వకపోవడంతో, వారి పరిధిలో గల ఒకటి, రెండు, మూడు వార్డులకు ఒక్కొక్కరుగా నామినేషన్ వేసి, బుధవారం ఉపసంహరించుకున్నారు.

సర్పంచ్ పదవిలో చిన్న తాండ నుండి ఇద్దరు, పెద్ద తాండ నుండి ఒకరు బరిలో ఉండగా, రెండు తండాల మధ్య బుధవారం వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. చివరకు ఎన్నికలు బహిష్కరిస్తామని, లేదంటే రెండు తాండాలకు రెండు పోలింగ్ బూతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇద్దరి మధ్య సయోధ్యకుదుర్చడానికి ఎంపీడీవో, తహశీల్దార్ తో పాటు పలువురు అధికారులు ప్రయత్నించిన పరిష్కారం కాకపోవడంతో, చివరకు ఆర్డీవో, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఘటనపై మండల ఎన్నికల అధికారి నాగేశ్వర్ ను వివరణ కోరగా చిన్న తాండ ఓటర్లు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరగా , ఉన్నతాధికారులకు నివేదిస్తామని, వారి సూచన మేరకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments