HomeTelanganaNizamabadభారీగా ఏకగ్రీవాలు …..మొదటి దఫా ఎన్నికలు జరిగే గ్రామాల్లో 27 సర్పంచ్ లు ఏకగ్రీవం.

భారీగా ఏకగ్రీవాలు …..మొదటి దఫా ఎన్నికలు జరిగే గ్రామాల్లో 27 సర్పంచ్ లు ఏకగ్రీవం.

మొదటి విడుత స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగాయి. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారంతో గడువు ముగిసింది. పలువురు అభ్యర్థులు నామినేష్లు విత్‌ డ్రా చేసుకోవడం, చాలాచోట్ల సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఒక్కొక్కరే బరిలో ఉండడంతో 27 సర్పంచ్ స్థానా లు ఏకగ్రీవమయ్యాయి.

జిల్లాలోనీ బోధన్ సబ్ డివిజన్ పరిధిలో 27 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారుకు వెల్లడించారు. మొదటి దఫా ఎన్నికలలో మొత్తం 184 గ్రామ పంచాయతీ లకు ఎన్నికలకు నిర్వహించనున్నారు.

వాటిలో వర్ణి మండలంలోని రుప్లానాయక్ తండా, సిద్దాపూర్, వకీల్ ఫారం,అఫండి ఫారం , సైద్‌పూర్, శంకర, రాజపేట, ఛలకతాండ, చింతల్‌పేట్ తండా,మల్లారం, బోధన్ మండలంలోని మావండి కలన్, భూలక్ష్మి క్యాంపు, పెంటకాలన్, పెంటా ఉర్దూ క్యాంపు, సాలూర మండలంలోని సాలూర క్యాంపు, సలాంపాడ్, ఫతేపూర్, కోటగిరి మండలంలోని రాంపూర్, అడ్కస్పల్లి, సుద్దులం తాండ,వల్లబాపూర్, దేవునిగుట్ట తాండ, చందూర్ మండలంలో లక్ష్మాపూర్,కరేగావ్, పోతంగల్ మండలంలో
పీఎస్ఆర్ నగర్,ఎడపల్లి మండలంలో బాపు నగర్, నవీపేట్ మండలంలో నారాయణపూర్ గ్రామాలలో గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మిగతా గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఈ నెల 11 న ఎన్నికలు నిర్వహిస్తారు.అలాగే అదే రోజు సాయంత్రం వరకు ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments