రాజధాని హైదారాబాద్ లో మరోసారి కాల్పులమోత మోగింది నడ్డి రోడ్డు మీద రియల్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రియల్టర్ ఘంటా వెంకటరత్నం(50)ను దుండగులు దారణంగా హత్య చేశారు. ఈ ఉదయం స్కూటీపై వెళ్తున్న అతడిని అడ్డుకొని కత్తులతో దాడి చేశారు. ఆపై తుపాకీతో కాల్చి, రాయితో తలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాగా జంటహత్యల కేసులో నిందితుడిగా ఉన్న వెంకటరత్నాన్ని ప్రత్యర్థులే చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
