HomeCRIMEనిజామాబాద్ నగరంలో రెండు ఏటీఎంలలో చోరీ స్థలాలను పర్యవేక్షించిన ఇంచార్జి పోలీస్ కమిషనర్ ...ఐదు...

నిజామాబాద్ నగరంలో రెండు ఏటీఎంలలో చోరీ స్థలాలను పర్యవేక్షించిన ఇంచార్జి పోలీస్ కమిషనర్ …ఐదు స్పెషల్ టీం ల ఏర్పాటు, ముమ్మరంగా తనిఖీలు..

శనివారం తెల్లవారుజామున నిజామాబాదు నగరంలో ఏటియం లచోరీ లు జరిగిన ప్రాంతాలను ఇంచార్జ్ కమిషనర్ కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించారు ఏటీఎంల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, చోరీ జరిగిన విధానం, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను అధ్యయనం చేశారు.

సీసీటీవీ ఫుటేజ్ సేకరణ: ఏటీఎం లోపలి మరియు పరిసర ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలను సేకరించి విశ్లేషణకు ఆదేశించారు.ప్రత్యేక బృందాల ఏర్పాటు: క్లూస్ టీమ్, సాంకేతిక నిపుణులు, స్థానిక పోలీస్ బృందాలతో మరియు 5 ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు.పెట్రోలింగ్ పెంపు: రాత్రి వేళల్లో ముఖ్యంగా ఏటీఎంలు, బ్యాంకులు, జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మొబైల్ పెట్రోలింగ్ పెంచారు.

నిఘా కట్టుదిట్టం: జిల్లా లో ప్రవేశ–నిష్క్రమణ పాయింట్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.బ్యాంకులతో సమన్వయం: ఏటీఎం భద్రతను బలోపేతం చేయడానికి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసుకొని అలారం వ్యవస్థలు, అదనపు సీసీటీవీలు, లైటింగ్ మెరుగుదలపై సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డీసీపీ ( అడ్మిన్ ) జి.బస్వారెడ్డి , నిజామాబాదు ఏసిపి రాజా వెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, 4 టౌన్ ఎస్హెచ్ఓ సతీష్ కుమార్ , టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్, 4 టౌన్ ఎస్ఐ శగంగాధర్ మరియు బ్యాంక్ మేనేజర్ శ్రీ శివకుమార్ తదితరులున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments