నిజామాబాద్ నగరంలో బీజేపీ సత్తా చాటుకుంది. కార్పొరేషన్ లో అతి పెద్ద పార్టీగా అవతరించింది మ్యాజిక్ ఫిగర్ కు అడుగు దూరం లో ఆగిపోయింది. గతంలో మాదిరిగానే 28 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలతో రెండో పెద్ద పార్టీ నిలిచింది. యంఐయం 13 స్థానాలు సాధించింది.
మేయర్ ఎన్నికలో ఆ పార్టీ కీలకంగా మారింది. వరసగా రెండు సార్లు మేయర్ స్థానం దక్కించుకున్న బిఆర్ యస్ ఒక్క స్థానానికే పరిమితం అయింది. మాదిరిగానే ఈసారి కౌంటింగ్ పక్రియ నత్తనడకన సాగుతుంది పొద్దుపోయేదాకా పూర్తీ స్థాయిలో ఫలితాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది .
మేయర్ స్థానం ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ యంఐయం మద్దతు ను కూడగట్టే ఛాన్స్ ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ నగరంలో మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని ఇక్కడే మకాం వేసి పనిచేసారు బీజేపీ ప్రాబల్యం నివారించడానికి సర్వశక్తులు ఒడ్డారు.
గతంలో రెండు స్థానాలకు పరిమితం అయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 18 స్థానాలకు సాధించింది. మైనార్టీ ఏరియాలో ను నాలుగు స్థానాలను గెలిచింది.
