తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆదివారం నిజామాబాద్ జిల్లాకు చెందిన జాగృతి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ‘తెలంగాణ జాగృతి’ నూతన కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో జాగృతి చేపడుతున్న సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నాయకులు ఆమెకు వివరించారు. జిల్లాలో సంస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాడటం మరియు రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై కవిత నాయకులకు దిశానిర్దేశం చేశారు.
నిజామాబాద్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. కవితను కలిసిన వారిలో జాగృతి నాయకులు కరిపే రాజు, సయ్యద్ రహిమ్, బిలిందర్ సింగ్, బాణాజి సునీల్, కర్పె అర్జున్ తదితరులు ఉన్నారు.
