HomeTelanganaNizamabadడాక్టర్ సీలం కవిత రెడ్డిని సన్మానించిన నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ

డాక్టర్ సీలం కవిత రెడ్డిని సన్మానించిన నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ

డాక్టర్ సీలం కవిత రెడ్డి ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిజామాబాద్ వారి స్వగృహంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజారోగ్య పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతానన్నారు.

హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ను మరింత అభివృద్ధి చేస్తానని డాక్టర్ కవితారెడ్డి పేర్కొన్నారు. మీడియా మిత్రుల సూచనలు సలహాలతో కార్యాచరణ రూపొందించి నిజామాబాద్ జిల్లాకు ఏమి అవసరము అనే విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి వాగ్మారి సుభాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. రాజు, జాయింట్ సెక్రెటరీ ఆంజనేయులు, ఈసీ సభ్యులు జయపాల్, రవి కుమార్, సుదర్శన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments