HomeCRIMEబోధన్ లో సినీ పక్కిలో చోరీ..... బ్యాంకు ఎదుటే లూటీ.......కారు అద్దాలు బ్రేక్ చేసి రూ...

బోధన్ లో సినీ పక్కిలో చోరీ….. బ్యాంకు ఎదుటే లూటీ…….కారు అద్దాలు బ్రేక్ చేసి రూ 3 లక్షలు మాయం

బ్యాంకు ముందే కారు అద్దాలను ధ్వంసం చేసి మూడు లక్షల రూపాయల నగదును లూటీ చేసిన ఉదంతం బోధన్ లో జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగింది బోధన్ మండలం జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన హరిబాబు వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు

ఈ భూమికి సంబంధించిన డబ్బులు చెల్లించేందుకు పట్టణంలోని కెనరా బ్యాంకులో 3 లక్షల రూపాయలు డ్రా చేసేందుకు శుక్రవారం వచ్చారు బ్యాంకులో డబ్బులు డ్రా చేసి కారులో పెట్టి మరో బ్యాంకుకు వెళ్లారు బ్యాంకు ముందు పార్కింగ్ చేసి ఉన్న కారు అద్దాలను పగలగొట్టి 3 లక్షల రూపాయల నగదును గుర్తుతెలియని దుండగులు దోచుకొని వెళ్లారు ఘటన స్థలానికి వచ్చేసరికి కారు అద్దాలు ధ్వంసం చేసి ఉండడం నగదును తీసుకొని వెళ్లడంతో హరిబాబు ఆందోళనకు గురయ్యారు

పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల సీసీ కెమెరాలు పరిశీలించారు సినీ పక్కిలో ఈ చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తును ప్రారంభించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments