భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని మాల మహానాడు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సుంకరి గంగాధర్ పిలుపునిచ్చారు.
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిజామాబాద్ నగరంలోని ఫులాంగ్ చౌరస్తాలో ఉన్న బాబాసాహెబ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, సమాజంలో సమానత్వం కోసం ఆయన పడిన తపన వెలకట్టలేనిదని కొనియాడారు.
ఆయన రచించిన రాజ్యాంగం వల్లే నేడు అణగారిన వర్గాలకు ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునావత్ నెహ్రూ నాయక్, రాజేష్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
