భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని నాల్గవ టౌన్ ఎస్ ఐ పిలుపునిచ్చారు.135వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిజామాబాద్ నగరంలోని ఫులాంగ్ చౌరస్తాలో ఉన్న బాబాసాహెబ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, సమాజంలో సమానత్వం కోసం ఆయన పడిన తపన వెలకట్టలేనిదని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే నేడు అణగారిన వర్గాలకు ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
