Saturday, April 18, 2026
HomeCRIME.. ఐదేళ్ల కొడుకు ను హత్య.. చేసిన కసాయి తల్లీ.... వివాహేతర సంబంధమే ?

.. ఐదేళ్ల కొడుకు ను హత్య.. చేసిన కసాయి తల్లీ…. వివాహేతర సంబంధమే ?

తమ వివాహిత సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నేపం తో కన్న తల్లే కసాయిగా మారింది ప్రియుడి తో కల్సి ఐదేళ్ళ కొడుకు ను అత్యంత క్రూరంగా హత్య చేసింది. ఈ అమానుష ఘటన కామారెడ్డి పట్టణం లోని జరిగింది ..

శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన లక్ష్మీకి వివాహం కాగా.. ఆమెకు ఐదేళ్ల శ్రావణ్, ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారు. కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె భర్తకు దూరంగా ఉంటూ, పిల్లలతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది.

ఈ క్రమంలో గత ఆరు నెలలుగా లక్ష్మీనర్సింలు అనే వ్యక్తితో ఆమెకు సన్నిహిత సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం.శుక్రవారం లక్ష్మీ పని మీద బయటికి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఉన్న చిన్నారి శ్రావణ్‌పై నిందితుడు నర్సింలు అమానుషంగా దాడి చేశాడు.

గొంతు పిసికి, నోరు–ముక్కు మూసి, నేలకేసి కొట్టి, కళ్లలో కారంపొడి పోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజంపేట గ్రామానికి చెందిన లక్ష్మీ బంధువు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!