Tuesday, April 21, 2026
HomePOLITICAL NEWSUncategorizedహస్త''గతం'' కానున్న… ఆర్మూర్ బల్దియా

హస్త”గతం” కానున్న… ఆర్మూర్ బల్దియా


-21న చైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారు ?

  • మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ

-ఫలించిన వినయ్ రెడ్డి మంత్రాంగం


  • జాన రమేష్, ఇది సంగతి, ఆర్మూర్:
    లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోబోతుంది. నియోజకవర్గ ఇంచార్జ్ వినయ్ రెడ్డి మంత్రాంగం ఫలించింది. ఈ నెల 21 మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక నిర్వహించాలని మున్సిపల్ శాఖ ఉత్తర్వ్యూలు జారీచేసింది.. గత ప్రభుత్వ పాలనలోచైర్మన్ గా బిఆర్ యస్ కు చెందిన పండిత్ వినీత పవన్ ఉన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ కి అనుకూలంగా పనిచేసారనే నేపం తో మాజీ ఎమ్మెల్యే సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
  • అటు తర్వాత బలపరీక్ష జరిగిన పిమ్మట అవిశ్వాసం విగిందా? నెగిందా? అనే సందిగ్ధత నెలకొంది. అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.చివరికి ఇంచార్జ్ వినయ్ రెడ్డి రంగంలోకి మంత్రాంగం నడపడంతో బిఆర్ఎస్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.. వినయ్ రెడ్డి దగ్గరుండి మరి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న మున్న ను ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరపున ఇంచార్జ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. బడ్జెట్ ఆమోదం కోసం చైర్మన్ ఎంపిక జరపాలని ప్రభుత్వాదేశాల మేరకు ఇన్చార్జి చైర్మన్ గా మున్న కొనసాగుతున్నారు.
  • ఇకపోతే నూతన చైర్మన్ ఎన్నిక ఎప్పుడు అని ఎదురుచూస్తున్న తరుణంలో చైర్మన్ ఎంపిక జరపాలని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం మెజార్టీ కౌన్సిలర్లు అందరూ కాంగ్రెస్ కండువా వేయడంతో బల్దియా పీఠంపై కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి మద్దతు ఉన్నవారే నూతన చైర్మన్ గా ఎన్నిక కానున్నారు. 21వ తేదీన చైర్పర్సన్ ఎన్నికకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. దీంతో ఆర్మూర్ బల్దియా పై కాంగ్రెస్ జెండా రెపరెపలాడడమే తరువాయి భాగంగా మారింది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!