Tuesday, January 20, 2026
HomePOLITICAL NEWSజిల్లాలోనూ ప్రణీత్ లున్నారు ….వారిమాటేమిటో ……యథేచ్ఛగా కాల్ డేటా ఇచ్చేస్తున్నారు ……. గతంలో సీఐ వ్యవహారం...

జిల్లాలోనూ ప్రణీత్ లున్నారు ….వారిమాటేమిటో ……యథేచ్ఛగా కాల్ డేటా ఇచ్చేస్తున్నారు ……. గతంలో సీఐ వ్యవహారం లో సీరియస్ యాక్షన్ ? గత ఎమ్మెల్యే లతో అంటకాగిన ఏసీపీలు ……ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకోవడానికి వారే అస్రం ?

డిఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారం పోలీస్ శాఖ ను కుదిపేస్తుంది. అధికార పార్టీ నేతల సేవ యావ లో పడి ప్రత్యర్థులను నీడలా వెంటాడి వారి వ్యక్తిగత రాజకీయ కదిలిక ను ఎప్పటికప్పుడు తెలుసు కోవడానికి ఆధునిక సాంకేతిక వ్యవస్థను దొడ్డి దారిలో వాడేసుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. కేవలం టెర్రరిస్టులు మావోయిస్టు కార్యకలాపాల నియంత్రించడనికి పనిచేసే స్పెషల్ ఇంటిలిజెన్స్ విభాగంలో ఉండే ఆధునిక సాంకేతిక వ్యవస్థను రాజకీయ అవసరాల కోసం గుట్టుగా వాడుకున్న వ్యవహారం పోలీసు శాఖ ప్రతిష్ఠనే మసక బారేలా చేసింది.

హైదారాబాద్ కేంద్రంగా ప్రణీత్ రావు సాగించిన అట రాజకీయ అగ్రనేతల వెన్నులోనే వణుకు పుట్టించింది.సరే ప్రభుత్వ పెద్దల కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్రణీత్ రావు నీడలా వెంటాడనేది అందరికి తెల్సిందే. కానీ జిల్లా స్థాయిలో లోనూ ఇదో దందా లా సాగింది.అధికార పార్టీఎమ్మెల్యే లతో పోస్టింగ్ లు పొందిన డిఎస్పీ లు అనేక మంది ప్రణీత్ రావు అవతారం ఎత్తారు. ఎమ్మెల్యే లు చెప్పడమే ఆలస్యం యథేచ్ఛగా సర్వీస్ ప్రొవైడర్ లనుంచి డేటా ను తెప్పించి ఇచ్చారు. గతంలో ఎమ్మెల్యే లు బీజేపీ కాంగ్రెస్ నేతల ను తమ పార్టీలో చేర్చుకోవడానికి …లేదంటే ప్రత్యర్థులు కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఏసిపి లనే పురమాయించేది. కేసుల దర్యాప్తు శాంతి భద్రతల నిర్వహణ గాలికి వదిలేసి ఎమ్మెల్యే లు ఇచ్చిన టాస్క్ లమీదే పనిచేసేది.ఎమ్మెల్యే లకు గిట్టని నేతల కాల్ డేటా నే కాదు ..చివరికి వాట్సాప్ చాటింగ్ లు సైతం సేకరించేది.

అంతే కాదు వారు ఎప్పుడు ?ఎక్కడ ఉన్నారు ? అనేది చెప్పేవారు. కేసులదర్యాప్తు లో పోలీసు శాఖ ఆధునికి సాంకేతిక వ్యవస్థమీదే ఆధారపడుతుంది. కేసుల దర్యాప్తు లో భాగంగా అనుమానితుల కాల్ డేటా ను సర్వీస్ ప్రొవైడర్ లనుంచి రోజువారీగా సేకరిస్తారు. కానీ కొందరు ఏసిపి లు ఎమ్మెల్యే లకు గిట్టని నేతలు వ్యాపారులు జర్నలిస్టు ఫోన్ నెంబర్ల ను ఆయా కేసుల్లో అనుమానితుల జాబితాలో చేర్చి కాల్ డేటా తెప్పించి ఎమ్మెల్యే లకు చేరవేశారు. కొందరు ఏసిపి లు గతంలో నేరుగా సర్వీస్ ప్రొవైడర్ లతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని యథేచ్ఛగా డేటా తెప్పించే వారు.

కాల్ డేటా లొకేషన్ వివరాలు ఇవ్వడానికి కొందరు అధికారులు భారీగా లబ్ది పొందేవారు. ఆర్మూర్ సబ్ డివిజన్ లో పనిచేసిన సీఐ కి కాల్ డేటా తెప్పించే అధికారం వుంటే అది అడ్డం పెట్టుకొని భారీగా వసూళ్ల కు తెర లేపడంతో అతన్ని నుంచి ఆ బాధ్యతలు తప్పించారు. గత పదేళ్ల కాలం లో వేలాది మంది కాల్ డేటా ను సర్వీస్ ప్రొవైడర్లు నుంచి సీఐ ఏసిపి లు పొందారనేది బహిరంగ రహస్యం. ఆ ఎమ్మెల్యే ఏకంగా సొంత కుటుంబ సభ్యుల కదలిక మీదే నిఘా వేయాలని గతంలో ఓ ఏసిపి ని పురమాయించారు. తన కొటారి లో ఉండే అరడజన్ మంది నేతల 20 రోజుల కాల్ డేటా వాట్స్ అప్ కాల్ వివరాలు ఇవ్వాలని గతంలో ఉన్న ఉన్నతాధికారి నే ఓ ఎమ్మెల్యే అడిగాడని సమాచారం.

అందులో ఇద్దరు నెంబర్ లు ఓ చోరీ కేసులో చేర్చి కాల్ డేటా తెప్పించారని ప్రచారం జరిగింది.గతంలో ఓ సీఐ నేరుగా సర్వీస్ ప్రొవైడర్ లను చేతిలో పెట్టుకొని అనేక విచ్చల విడిగా కాల్ డేటా లొకేషన్ వివరాలు తెప్పించేది. దీనితో ఆయన ఈ వ్యవహారంలో మంచి ఖ్యాతి పొందారు. నిజానికి రాజకీయ నేతలు .జర్నలిస్టుల కదలికల మీద అనేది పోలీసు శాఖ లో యస్ బి విభాగం పని. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఆ విభాగంలో పనిచేసే వారే అవసరాల మేరకు నిఘా పెడుతారు. కానీ కాల్ డేటా తీసుకోవడానికి మాత్రం కచ్చితంగా యూనిట్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి కానీ ఏసిపి సీఐ లు స్థానిక ఎమ్మెల్యే సేవలో తరించడానికి ఇదో దందా సాగించారు.కానీ ప్రణీత్ రావు ఉదంతం తో ఇలాంటి అధికారులకు కనువిప్పు కలుగుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!