HomeHEALTHఆసుపత్రి సూపరింటెండెంట్ ను సన్మానించిన... బిసిటియు

ఆసుపత్రి సూపరింటెండెంట్ ను సన్మానించిన… బిసిటియు

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డాక్టర్ నాగమోహన్ గారిని బిసిటియు ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని ఆయన ఛాంబర్ లో కలిసి శాలువా పూల బొకే తో ఘనంగా సన్మానించి సావిత్రి బాయి పూలే జ్ఞాపిక ను అందజేశారు.

ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ సేవా గుణం మరియు పేదల పక్షపాతి అయిన నాగమోహన్ జిల్లా ఆసుపత్రి కి సూపరింటెండెంట్ గా రావడం తో పేదలకు ఆరోగ్య పరంగా మేలు జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో టిఎన్జివో జిల్లా అసోసియేటడ్ అధ్యక్షులు పెద్దొళ్ల నాగరాజు, బిసిటియు అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామ కృష్ణ, గౌరవ సలహాదారులు రమణ స్వామి, కోశాధికారి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్ కుమార్, వేణు, రవిచంద్ర, సుమన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments