*లేబర్ కోడ్స్ రద్దు నినాదంతో *140వ మేడే దినోత్సవాన్ని జరుపుదాం!*************************************ఐఎఫ్టియు నాయకులు దాసు, శివాజీ.**************************************కార్మికులు పోరాడి సాధించుకున్న 140 మే డే దినోత్సవాన్ని లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ తో నిర్వహించాలని ఐ ఎఫ్ టి యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, ఉపాధ్యక్షులు శివాజీ కార్మికులకు పిలుపునిచ్చారు. 24ఏప్రిల్ 2026 తేదీన ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లిలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే గోడప్రతులను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దాసు శివాజీలు మాట్లాడుతూ అమెరికాలోని చికాగో లో 8 గంటల పని దినానికై కార్మికుల పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం నేడు అమలవుతుందని వారు తెలిపారు. నరేంద్ర మోడీ గారు కార్మికుల శ్రేయోభిలాషి అంటూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి, 12 గంటల పని విధానం తీసుకురావడంలో మోడీ అసలు రూపం బయటపడిందని వారన్నారు. కార్మికులను మనుషులుగా కూడా గుర్తించని దుర్మార్గపు బిజెపి ప్రభుత్వ విధానాలను కార్మికులొకం అర్థం చేసుకోవాలని వారు కోరారు. వందేళ్ళ త్యాగంతో కార్మికులు సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతుందని వారు విమర్శించారు. 2026ఏప్రిల్ ఒకటి నుండి కార్మిక వ్యతిరేక నాలుగు కార్మిక కోడ్లను అమలు చేస్తామని ప్రకటించడం దుర్మార్గమని వారన్నారు. ప్రజాస్వామిక విలువల పట్ల నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి లేదని, అందుకే ప్రశ్నించే గొంతులను నిర్బంధిస్తుందని, వారన్నారు. ఇరాన్ ప్రజలపై దుర్మార్గంగా యుద్ధం ప్రకటించిన అమెరికా సామ్రాజ్యవాద విధానాన్ని ఖండించడంలో మెతక వైఖరి ప్రదర్శించడంతో ప్రపంచం ముందు భారత దేశం పరువు పోయిందని వారు అన్నారు. ఈ యుద్ధం వల్ల గ్యాస్ ధర, నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయని, సామ్రాజ్యవాద అమెరికా దురహంకార యుద్ధాన్ని ప్రజలు ఖండించాలని వారు పిలుపునిచ్చారు. మేడే అమరవీరుల స్ఫూర్తితో హక్కులకైఉద్యమించినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు అబ్దుల్, బాలయ్య, లక్ష్మి, భానుచందర్, సొప్పరి గంగాధర్, నరేందర్, మగ్ధమ్ పటేల్, వర్ణా రెడ్డి, బండి పోచన్న, పల్నాటి సాయన్న, రషీద్, చిట్టక్క, ధనలక్ష్మి, సర్వర్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు *సూర్య శివాజీ* ఉపాధ్యక్షులు ఐఎఫ్టియు జిల్లా కమిటీ *ఆర్మూర్* –నిజామాబాద్. 24- 4– 2026.
