లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ సర్వసభ్య సమావేశం ఆదివారం నిజామాబాదు నగరంలోని సందీప్ గార్డెన్స్ లో జరిగింది.
ఈ సందర్భంగా 2026-27 సంవత్సరానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.క్లబ్ అధ్యక్షుడిగా పెట్టిగాడి రాఘవేందర్,కార్యదర్శిగా చింతల గంగాదాస్,కోశాధికారిగా అంకం రాజేందర్ ఎన్నికయ్యారు.
ఎన్నికల అధికారిగా లయన్స్ జిల్లా అదనపు కోశాధికారి పి.లక్ష్మినారాయణ వ్యవహరించారు..లయన్స్ సేవలను మరింత విస్తృత పరుస్తామని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాఘవేందర్ ఈ సందర్భంగా చెప్పారు.
కార్యక్రమంలో లయన్స్ జిల్లా కార్యదర్శులు డి.యాదగిరి,కె.రవీందర్,జోన్ చైర్మెన్ అబ్బాయి లింబాద్రి,రీజియన్ పూర్వ చైర్మెన్ బి.గురుప్రసాద్,డైరెక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
