నగర నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన ఎకరం భూమి ని కారు చౌకగా కాంగ్రెస్ పార్టీకి కట్టబెడుతూ కలెక్టర్ నుంచి ఉత్తర్వ్యూలు జారీఅయ్యాయి. బుధవారం పీసీసీ చీఫ్ ఇక్కడే కొత్త కాంగ్రెస్ భవన్ కోసం భూమి పూజ కూడా చెయ్యబోతున్నారు.
గతంలో బిఆర్ యస్ పార్టీ కు సైతం అప్పటి ప్రభుత్వ సమీపంలోనే ఇరిగేషన్ స్థలం ను కేటాయించారు.ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగ పడాల్సిన విలువైన భూములు రాజకీయ పార్టీల భవనాల కు కేటాయించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
అధునాత వసతి సౌకర్యాలతో బస్టాండ్ ఏర్పాటు కోసం ప్రతిపాదన లో ఉన్న అత్యంత ఖరీదైన భూమి కారు చౌకగా కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. ఈ మేరకు ఆరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భవనాల కోసం ప్రభుత్వ భూమలను కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ కు సైతం నగరం లోనే ప్రభుత్వ భూమి కేటాయించాలని పీసీసీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ మేరకు ప్రస్తుతకాంగ్రెస్ భవన్ కు ఎదురుగానే ఆర్ అండ్ బి కి చెందిన ఎకరం భూమి తమకు కేటాయించాలని పీసీసీ నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు సీసీఎల్ సైతం క్లియరెన్స్ ఇచ్చేసింది.
ఆ మేరకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంతో కాంగ్రెస్ పార్టీకి అత్యంత విలువైన భూమి కాంగ్రెస్ పార్టీ నా మాత్రం ధర కు సొంతం చేసుకుంది. నిజానికి బహిరంగ మార్కెట్ ఈ ప్రాంతంలో గజం లక్ష నుంచి లక్షన్నర విలువ ఉంది ఏకంగా ఎకరం భూమి అంటే రమారమి గా రూ 30 కోట్ల మేరకు వుంటుంది.
ఈ భూమి కోసం కాంగ్రెస్ పార్టీ జస్ట్ నాలుగున్నర లక్షల రూపాయలే ప్రభుత్వానికి చెల్లించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితమే స్వాధీనం చేసుకొని చదును కూడ చేసి భారీ భవన నిర్మాణానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే అదే ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ భవన్ ఉన్న భూమి కూడా ప్రభుత్వానిదే !
