ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మరణించారు. కాంకేర్ జిల్లాలో పోలీసులను లక్ష్యంగా చేసుకొని గతంలో మావోయిస్టులు ఐఈడి అమర్చారు.
దాన్ని తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలి ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ జవాన్లు మరణించారు. చోటాబిటియా పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మరో జవాను గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
