ఇటీవలే ఏఆర్ ఎస్ఐ నుంచి సివిల్ ఎస్ఐగా పదోన్నతి పొందిన మహేష్ శనివారం నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
పదోన్నతి అనంతరం శిక్షణలో భాగంగా మహేష్ ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఏసీపీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
మహేష్‌ను అభినందించిన ఏసీపీ, శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసింగ్ అంశాలపై పట్టు సాధించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
