Saturday, May 2, 2026
HomeLaw and Orderఏసీపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఐ మహేష్ఇ

ఏసీపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఐ మహేష్ఇ

ఇటీవలే ఏఆర్ ఎస్ఐ నుంచి సివిల్ ఎస్ఐగా పదోన్నతి పొందిన మహేష్ శనివారం నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

పదోన్నతి అనంతరం శిక్షణలో భాగంగా మహేష్ ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఏసీపీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

మహేష్‌ను అభినందించిన ఏసీపీ, శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసింగ్ అంశాలపై పట్టు సాధించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!