ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నేడు సుద్దపల్లి గ్రామంలోనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నందు నిత్యావసర సరుకుల ఛాలెంజ్ -2026 కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగింది నిరంతరం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమలకి సంబంధించి ఈ నిత్యవసర వస్తువుల ఛాలెంజ్ ను స్వీకరించి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నిత్యవసర సరుకులు అందచేయడం జరిగింది
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా సుద్దపల్లి గ్రామ ఉపసర్పంచ్ క్రాంతి కుమార్ హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ చేస్తున్న సేవ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తి నిస్తునాయని కొనియాడారు అనాథలకు సేవ చెయ్యడమంటే భగవంతుని సేవ చేయడమేనని అన్నారు ఇందూరు యువత సేవలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయాన్ని తెలిపారు
అనంతరం డిచ్పల్లి పోలీస్ స్టేషన్ ఏ.ఎస్. ఐ ముజిముద్దీన్ మాట్లాడుతూ మానవత్వాని ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ నిలువెతు నిదర్శనమని అన్నారు మరియు బీ.జే.వై.యం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ మాట్లాడుతూ ఆకలితో అలమటిoచే అనాథలకు ప్రతినిత్యం అన్నదానం చెయ్యడం గొప్ప విషయమని అన్నారు ఇలాంటి సేవ కార్యక్రమాల్ని మా గ్రామం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు ఎలాంటి సేవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని అన్నారు
ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.మద్దకూరి సాయిబాబుమరియు వి.డి.సి చైర్మన్ జనార్ధన్ వైస్ ఛైర్మన్ కాతదర్ గంగాధర్ దేవ్పల్లి సర్పంచ్ సురేష్ ఇందూరు యువతకార్యవర్గం మద్ది గంగాధర్ ,కొండా నాగేందర్,దర్శనం రాజు, అఫ్రోజ్ గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు
