HomeTelanganaNizamabadఏంసెట్‌లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మెహన్ చరణ్..తెలంగాణలో 369 ర్యాంక్‌తో నిజామాబాద్‌కు గుర్తింపు

ఏంసెట్‌లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మెహన్ చరణ్..తెలంగాణలో 369 ర్యాంక్‌తో నిజామాబాద్‌కు గుర్తింపు



నిజామాబాద్ నగరానికి చెందిన జక్కగురు మెహన్ చరణ్ ఏంసెట్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబర్చి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 369వ ర్యాంక్ . ఎంపీసీ విభాగంలో జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం ద్వారా నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు.


ఈ సందర్భంగా మంగళవారం ఆయనను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. విద్యార్థి కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.


మెహన్ చరణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందించారు. ఆయన సాధించిన విజయంతో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో మర్రి కిరణ్, డి. వెంకట్ రమణ గౌడ్, ఎక్స్ జి.పీ. లాయర్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments