రాజధాని హైదరాబాద్ లో ఓ న్యాయవాదిపై సినిమా పక్కి లో హత్యాయత్నం జరిగింది. ఇంటి నుండి బయటకు వచ్చికారు ఎక్కడానికి సిద్ధం అవుతుండగానే గుర్తు తెలియని వ్యక్తులు కారుతో వచ్చి ఢీ కొట్టి పారి పోయారు.
మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. న్యాయవాది కాజా మొయినుద్దీన్ ఇంటి నుండి బయటకు వచ్చి కారులో వెళ్లేందుకు సిద్దం అయ్యారు. ఆయన కారు డోర్ తీస్తున్న సమయంలో అప్పటికే ఆయన ఇంటి పక్కన కాపు కాస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు.
ఆయన కారులో ఎక్కే ప్రయత్నం చేస్తున్న సమయంలో వెనకనుండి ఒక్కసారిగా వేగంగా వచ్చి ఢీ కొట్టారు. దాడితో మొయినుద్దీన్ ఎగిరి కిందపడిపోయారు.
ఆయనకు తీవ్రగాయాలు కాగా ఢీ కొట్టిన వెంటనే నిందితులు అక్కడ నుండి పరార్ అయ్యారు. ప్రస్తుతం న్యాయవాది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం పోలీసులు హుటాహుటిన వచ్చి దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు
