HomeTelanganaNizamabadఅసత్య ప్రచారాలను సంయమనంతో ఎదుర్కొందాం: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

అసత్య ప్రచారాలను సంయమనంతో ఎదుర్కొందాం: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

పత్రికా స్వేచ్ఛపై కాంగ్రెస్‌కు గౌరవం ఉందిమన పనితీరుకు క్యాడరే అసలైన నెంబర్లు.. ఆవేశపడొద్దుకాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగబద్ధమైన విధానాలకు కట్టుబడి పనిచేసే పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

మీడియాలో వచ్చే కొన్ని కల్పిత కథనాలకు నాయకులు, కార్యకర్తలు ఎవరూ కుంగిపోవద్దని, ఆవేశానికి లోనుకావద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఒక ప్రముఖ వార్తా ఛానల్‌లో తనపై, కాంగ్రెస్‌ పార్టీపై రోజంతా ప్రసారమైన కథనాలపై ఆయన స్పందించారు. నా ప్రాణ సమానమైన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు ఒక సవినయ విజ్ఞప్తి. ఒక ఛానల్‌లో నాపైన, పార్టీపైన పూర్తిగా అభూతకల్పనలతో, అసత్యాలతో కూడిన కథనాన్ని రోజంతా ప్రసారం చేశారు.

నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేసేలా సాగిన ఆ కథనాలను చూసి కాంగ్రెస్‌ క్యాడర్‌ తీవ్ర ఆగ్రహానికి, ఆవేశానికి గురైనట్లు నా దృష్టికి వచ్చింది. కానీ, మనం ఎల్లప్పుడూ చట్ట పరిధిలో, రాజ్యాంగబద్ధంగా పనిచేసే సంస్కృతిని అలవర్చుకున్నాం.

మనకు పత్రికా స్వేచ్ఛ అన్నా, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నా అత్యంత గౌరవం ఉంది” అని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. సదరు ఛానల్‌లో ఏదో కల్పిత వార్త ప్రసారం చేసినంత మాత్రాన మనం గురవాల్సిన అవసరం లేదు.

మన పనితీరును, నిబద్ధతను నిర్ణయించాల్సింది మన పార్టీ క్యాడర్‌ మాత్రమే తప్ప కొన్ని మీడియా సంస్థలు కాదు. ఇలాంటి కథనాలు మన స్థైర్యాన్ని, పనితీరును ఎంతమాత్రం కుంగతీయువు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ ఒక్కరూ కూడా ఈ తరహా ప్రచారాలపై ఆందోళన చెందవద్దని, అందరూ ఓపికగా, ప్రశాంతంగా, పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని టీపీసీసీ చీఫ్‌ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు, కల్పిత కథనాలన్నింటికీ కాలమే సరైన సమాధానం చెబుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments