మంగళవారం మదన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మంజుల మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి, బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మదన్‌పల్లి గ్రామ ఉప సర్పంచ్ రాస మహేష్, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
