రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది శ్రీరామ్ చక్రవర్తి పటేల్ ఉద్ఘాటించారు తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఉత్తమ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు కొత్తగా ఏర్పాటు చేసిన మున్నూరు కాపు కార్పొరేషన్ విధివిధానాలను త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు పూర్తిస్థాయి కార్యాలయం ఏర్పడ్డ తర్వాత మున్నూరు కాపులు ఎవరైనా సమస్యల పరిష్కారానికి తమ వద్దకు వస్తే ఆ దిశలో తమ వంతు సాకారం అందిస్తామన్నారు
ప్రతి జిల్లాలో కాపు సంఘాలు కార్యాలయాల్లో కళ్యాణ మండపాల్లో కార్పొరేషన్ కు సంబంధించిన సమాచారాన్ని నోటీసులు ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ జీవో కాపులకు అందుబాటులో ఉన్న రెండు ఎకరాల వారి వసతి గృహాలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండమన్నారు
జిల్లాలోని ఆయా సంఘాల ప్రతినిధులు దృష్టికి తీసుకు వస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ కాపు సోదరుల కుటుంబాల అభ్యున్నతికి జిల్లా కమిటీ ఎల్లప్పుడూ చెప్పారు కాపు విద్యార్థులు అందరూ రానించి వివిధ స్థాయిలో ప్రభుత్వం కావాలన్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్సి తదితర కోర్సుల్లో చేరి ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ పరీక్షల్లో అభ్యసించడానికి జిల్లా సంఘం కమిటీ సభ్యులతో సంప్రదించి ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు.
కార్యక్రమానికి సభాధ్యక్షులుగా తోట రాజశేఖర్ అధ్యక్షులు జిల్లా మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బపూర్ రవీందర్ ప్రతిభ అవార్డ్స్ నివేదికను సమర్పించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బుస ఆంజనేయులు నగర డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య మాజీ జెడ్పిటిసి గోపి సంఘం కోశాధికారి సురేష్ ఉపాధ్యక్షులు R నరేష్ k.హరిచరణ్ సలహాదారులు అబ్బాయి లింబాద్రి చిట్టి నారాయణరెడ్డి శేఖర్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు సల్ల సత్యనారాయణ అర్జన్ శేఖర్ మహిళ సెక్రటరీలు స్వర్ణలత ఎండల స్వప్న పట్టణంలోని వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు బంటు బలరాం బుడుగు కిషన్ రెడ్డి కురువ నరసయ్య సంతోష్ సుదం సాయన్న మిద్దె రవికుమార్ కొరటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ప్రతిభా పురస్కారాలు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పీజీ సెట్ క్రీడల అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంస పత్రంతో గోల్డ్ మెడల్ శాలువాతో సత్కరించడం జరిగింది ముందుగా రెంజర్ల జిగిషా పటేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించినందుకు ఘనంగా సత్కరించడం జరిగింది.
అనంతరం ముఖ్య అతిధులను గౌరవ అతిథులను కూడా ఘనంగా సత్కరించడం జరిగింది.కార్యక్రమంలో తన పాటలతో మంత్రముగ్ధులు చేసిన సిర్పలింగం అర్షపల్లి ని జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ గారు సత్కరించారు.
