HomeTelanganaNizamabadవిశిష్ట సేవలకు.. ఉత్తమ స్థాయిలో గుర్తింపు... హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కు గవర్నర్ ద్వారా...

విశిష్ట సేవలకు.. ఉత్తమ స్థాయిలో గుర్తింపు… హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కు గవర్నర్ ద్వారా అవార్డు బహూకరణ..స్వచ్ఛందంగా రక్త దానాన్ని ప్రోత్సహిస్తున్నందుకు వరించిన అవార్డు..

సమాజ హితాన్ని కాంక్షిస్తూ స్వచ్ఛంద రక్త దానాన్ని ప్రోత్సహిస్తున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కు అత్యున్నత స్థాయిలో విశిష్ట పురస్కారం దక్కింది.

నిజామాబాద్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ద్వారా నెలకొల్పబడిన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడిచిన 18 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా రక్త దాన శిబిరాలు నిర్వహిస్తూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండడంతో ఉత్తమ స్థాయిలో పురస్కారం దక్కింది. హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ చేసిన విశిష్ట సేవలను గుర్తించిన రాజ్ భవన్ వర్గాలు, ఫౌండేషన్ ను ఉత్తమ పురస్కారం కోసం ఎంపిక చేశాయి.

ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అవార్డు బహూకరించారు.

హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ తరపున ఆ సంస్థ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ, ప్రస్తుతం వర్ని మండల తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ కుమార్ గవర్నర్ ద్వారా జ్ఞాపికను అందుకున్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకులను పలువురు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments