తొక్కిస లాట కేసులో నిందితుడిగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులోఅల్లు అర్జున్ నిందితుడిగా ఉన్నారు .
ఈ కేసులో విచారణ పూర్తీ చేసిన పోలీసులు ఛార్జ్ షిట్ దాఖలు చేసారు అందుకే ట్రయల్ మొదలయింది.ఈ నెల 22న కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి కోర్టు సమన్ ఇచ్చింది .
మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు దాఖలు చేసిన ఈ ఛార్జ్ షీట్‌లో నటుడు అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా (A11) చేర్చారు. కాగా, ఈ కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని వరుసగా A1 నుంచి A10 వరకు నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.నిందితులకు ఈపాటికే కోర్టు బెయిల్ మంజూరి చేసింది
